ఒక సినిమా సూపర్ హిట్ అయితే రీమేక్ సహజమే. ఒక భాషల్లో కాదు ఆయా లాంగ్వేజ్ ల రిజల్ట్ ను బట్టి ఐదారు భాషల్లో కూడా అవి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ, ఒక్క సినిమా హిట్టయ్యాక దాన్ని రీమేక్ చేసేందుకు ఏడాది టైం తీసుకుంటున్న హీరో బహుశా ఒక్క మెగాపవర్ స్టార్ రాంచరణ్ కావొచ్చు. గతేడాది తమిళ్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది తని ఒరువన్. జయం రవి, అరవింద స్వామి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ రీమేక్ రైట్స్ ను వెంటనే కొనేసుకున్నాడు రాంచరణ్. తెలుగు నెటివిటి కోసం చిన్న చిన్న మార్పులు చేయాలని, అందుకోసం దర్శకుడు సురేందర్ రెడ్డికి పనులు కూడా అప్పజెప్పాడు. ధృవ అంటూ ఓ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశాడు. కానీ, ఇంతవరకు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
స్క్రిప్టు అంతా రెడీగా ఉన్నప్పటికీ ఎందుకు లేట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు చరణ్ కి ఇంకో షాకింగ్ కలిగించే న్యూస్ ఏంటంటే... తనిఒరువన్ సీక్వెల్ రాబోతుందని. ప్రస్తుతం మాతృక చిత్ర దర్శకుడు మోహన్ రాజా ఆ పనిలోనే వున్నాడనేది తాజా సమాచారం. సీక్వెల్ కి సంబంధించిన కథ, కథనాలను ఆయన రెడీ చేస్తున్నాడని చెబుతున్నారు. జయం రవి 25వ సినిమాగా ఈ సీక్వెల్ రానుందని అంటున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సీక్వెల్ రిలీజ్ కానుందట. మరి ఇప్పటిదాకా మొదటి పార్ట్ మన దగ్గర అతిగతి లేదు. మరి అలాంటప్పుడు సీక్వెల్ వస్తే ఈ మొదటి పార్ట్ రీమేక్ కి అంత ప్రాధాన్యం ఉంటుందా? చరణ్ ఇప్పటికైనా త్వరపడితే బెటర్,