వరుణ్ మణియన్ తో బ్రేకప్ తరువాత ఇటీవలే పెళ్ళి గురించి ముచ్చటించింది త్రిష. ఓ ఇంటర్వ్యూలో వివాహ వ్యవస్థపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్ళెప్పుడు అని ప్రతి వారూ అడిగే ప్రశ్నలతో విసిగెత్తిందని, వరుణ్‌తో బ్రేకప్ తననేమీ బాధించడం లేదనీ, చాలా ఆనందంగా ఉన్నానని అన్నది. విడిపోడానికి కారణం చెప్పాలంటే కొందరి గురించి ప్రస్తావించాలి కాబట్టి చెప్పలేను. వివాహవ్యవస్థపై నమ్మకం ఉంది. అలాగని మనసుకు నచ్చినవాడికోసం ఇంకొంతకాలం ఆగుతా.. ఏడేళ్ళ క్రితం నచ్చిన లవర్ దొరికితే అప్పుడే పెళ్లి చేసుకునేదాన్ని .. కానీ సొసైటీ కోసం అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎవరికీ లేదు. మా అమ్మకు అన్నీ తెలుసు... ప్రస్తుతం కెరీర్ ఇంకా బిజీ అయిందని, మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకూ వెయిట్ చేస్తానని అంటోంది త్రిష .