‘కంచె’ ఆడియో వైజాగ్ లో ఈ నెల 17న

September 11, 2015 | 11:13 AM | 1 Views
ప్రింట్ కామెంట్
kanche_audio_17th_niharonline

‘కంచె’ సినిమాలో 1942 నాటి రెండో ప్రపంచ యుద్ధ సంఘటనలలో విశాఖ పట్నం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకొంది. అప్పట్లో జరిగిన బాంబు దాడుల్లో సముద్రంలో అత్యంత శక్తి వంతమైన బాంబు పేలి ఉంటే ఈ రోజున విశాఖ పట్నం రూపురేఖలు ఉండేవి కావట. ఈ కథను లింక్ చేస్తూ తీసిన కంచె ఆడియోను విశాఖ పట్నంలో నిర్వహించాలని ఈ చిత్ర బృందం సంకల్పంచింది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక బలమైన ఎమోషన్‌ను చూపించే క్రిష్, ‘కంచె’ సినిమాను రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంతో ముడిపెట్టాడు. ఇంతకు ముందు సెప్టెంబర్ 12న ఈ సినిమా ఆడియో రిలీజ్‌ను ప్లాన్ చేసినా, తాజాగా ఈ రిలీజ్‌ను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఈ ప్రత్యేక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని కంచె ఆడియోను విశాఖపట్నంలో నిర్వహించనుండడం విశేషం. ఈ ఆడియో కార్యక్రమాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో పోర్ట్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతన్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ