గత కొంత కాలంగా త్రివిక్రమ్ కు డైరక్షన్ చేయడానికి హీరోలెవరూ కాళీగా లేరంటూ వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఇప్పటికీ ఓ స్టార్ హీరో ఈ మాటల మాంత్రికుడికి దొరికేశాడట. తమిళ స్టార్ సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు తెలుగు స్టార్ హీరోలకు సమానంగా ఆయన సినిమాలకు ఇక్కడ క్రేజ్ ఉంటుంది. అయితే సూర్య మాత్రం ఇప్పటి వరకు స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదు. ఆ మధ్య తన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సూర్య మంచి కథ దొరికితే త్వరలోనే తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తానని వెల్లడించారు. ఎట్టకేలకు సూర్య కోరిక నేరవేరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూర్యను కలిసి ఓ కథ చెప్పినట్లు సమాచారం. సూర్య కూడా చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు టాక్. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అన్ని సజావుగా జరిగితే 2016లో సూర్య-త్రివిక్రమ్ చిత్రం మొదలవుతుందని చెన్నై టాక్. ఇది ఎంత వరకూ నిజమైన వార్తో కొద్దికాలం వెయిట్ చేస్తే గానీ తెలియదు.