సినిమా విశ్లేషణలకు విలువుందా?

June 22, 2015 | 05:03 PM | 0 Views
ప్రింట్ కామెంట్
tippu_hero_about_reviews_niharonline

సినిమా రిలీజ్ కాగానే క్రిటిక్స్ పత్రికల్లో రివ్యూస్ ఇవ్వడం ఎప్పటినుంచో వస్తున్నదే అయినప్పటికీ, ఒకప్పుడు వీటికొక విలువ ఉండేది. మంచి అనుభవజ్నులు రాయడం వల్ల వాటికో విలువుండేది.. అప్పట్లో పత్రికలు కొద్ది సంఖ్యలో ఉండేవి కాబట్టి విశ్లేషణలను బట్టి ఆ సినిమాను అంచనా వేయడం జరుగుతుండేది మరి ఇప్పుడు పేపర్లతో పాటు, ఛానళ్ళు, న్యూస్ పోర్టల్స్ వందల సంఖ్యలో ఉండడం, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు రేటింగ్స్ ఇస్తుండడం వల్ల వాటికి విలువ లేకుండా పోతోంది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చే సరికి రివ్యూలనేవి అవసరం లేనివిగా కనిపిస్తుంటాయి. తమపై పడి సమీక్షకులు, సినిమా వెబ్‌సైట్లు బతికేస్తున్నాయనే భావన వారిలో వుంటుంది. ఒక సినిమా ఫ్లాపయిందంటే దానికి కారణం రివ్యూలని, సినిమా హిట్టయితే మాత్రం తమ గొప్పతనమని అనే ఫీలింగ్‌తో గడిపేస్తున్నారు.  అయితే నిజానికి తెలుగు సినిమా మార్కెట్‌పై ఒక రివ్యూ ప్రభావం చాలా తక్కువ. అప్పుడప్పుడూ కొన్ని చిన్న సినిమాలకి హెల్ప్‌ అవుతుంటాయి లేదా ఓవర్సీస్‌ కలెక్షన్స్‌కి హెల్ప్‌ అవుతుంటాయి కానీ రివ్యూల వల్ల టాలీవుడ్‌ మార్కెట్‌ అంతగా ఎఫెక్ట్‌ అయిన దాఖలాలు లేవు. అయితే తమ పనిని విమర్శించడానికి వీళ్లెవరు అనే ఈగోతో కొందరు దర్శకులు, హీరోలు అడపాదడపా వచ్చి రివ్యూలపై ఫైర్‌ అవుతుంటారు. టిప్పు అనే సినిమా హీరో, దర్శకుడు ఇద్దరూ వచ్చి నెగెటివ్‌ రివ్యూల వల్ల జీవితాలు, కెరియర్లు నాశనం అయిపోతున్నాయని వాపోయారు. వీరనే కాదు.. ఈమధ్య తరచుగా ఈ టాపిక్‌ డిస్కషన్‌కి వస్తూ రివ్యూలని బ్యాన్‌ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ