బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గారాల పట్టి ప్రస్తుత యంగ్ హీరోయిన్ అలియాభట్ షూటింగ్‌లో గాయపడిందట. ఈ విషయాన్ని చెపుతూ, రెండువారాల్లో కోలుకుంటానని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అలియా ప్రస్తుతం తమిళనాడులో‘కపూర్ అండ్ సన్స్’ అనే మూవీ షూటింగ్‌కి హాజరయ్యింది. చిత్రీకరణ సమయంలో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నప్పుడు కుడి భుజానికి గాయమైందట. వెంటనే యూనిట్ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొద్దివారాలు రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. గాయం కారణంగా ఆదివారం జరిగిన యోగా డేను జరుపుకోలేకపోయానని తెలిపింది. ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న తన సొంత ఇంట్లో అక్కతో ఉంటోంది అలియాభట్.