ఇటీవలే నిశ్చితార్థం జరుపుకున్న హీరోయిన్ త్రిష సౌతిండియా ఈరోజు(మే 4) 32వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఆదివారం అర్థరాత్రి ఆమె సన్నిహితులందరూ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు అతి సన్నిహిత స్నేహితుడ దగ్గుబాటి రానా అన్న విషయం ఇంతకుముందే అందరికీ తెలుసు. ఆయన కూడా ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండాలని విష్ చేసాడు. దీనికి త్రిష వెంటనే, ‘థ్యాంక్యూ సైకో' అంటూ రిప్లై ఇచ్చింది. దీన్ని వీరిది ఎంత దగ్గరి బంధమో అర్థమై పోయింది. ఈ బర్త్ డే విషెస్ తో అందరూ త్రిష గురించి మాట్లాడుకోడానికి మరో టాపిక్ దొరికింది. వరుణ్ మణియన్ ఆమెకు విషెస్ తెలపకపోవడమే ఈ టాపిక్. దీన్ని బట్టి వీరి నిశ్చితార్థం నిజంగానే రద్దయినట్టు మాటాలడుకుంటునానరు. దీంతో ఆమె నిశ్చితార్థం రద్దయిందని మట్లాడుకుంటున్న వారికి మరింత బలం చేకూరినట్టయింది. రానాతో పాటు త్రిషకు ఆమె ప్రెండ్స్ చాలా మంది ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. హీరోయిన్ తాప్సీ, నికీషా పటేల్, కార్తీక నాయర్, జయం రవి, నీరజ కోన, విశాల్, హన్సిక, చిన్మయి తదితరులంతా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వరుణ్ మణియన్ తొడిగిన రింగ్ కూడా త్రిష తీసివేయడంతో.. ఇక వీరు కలవనట్టే అని అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా... లిప్ కిస్‌లకు ఈమె ఓకే అంటోందని మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఇప్పుడు వివాహం ఊసెత్తకుండా సినిమాల మీద సినిమాలు బుక్ చేసుకుంటోంది. భూ లోకం, అప్పాటక్కర్, లయన్ (తెలుగు) చిత్రా ల తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబుతో నటిస్తోంది. కమల్ నటిస్తున్న ఓర్ ఇరవు చిత్రంలోనూ నటిస్తోందట. ఇదివరకే ‘విన్నిల్‌దాండి వరువాయి?’ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి శింబుతో నటించిన త్రిష సెల్వరాఘవన్ చిత్రంలో అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాల్లో బిజీ అవడం... కనీసం వరుణ్ గ్రీటింగ్స్ కూడా చెప్పకపోవడం... ఇవన్నీ చూస్తుంటే పెళ్ళి రద్దయినట్టే అని అనుకుంటున్నారంతా...