నాకు తగిన వాళ్ళు దొరుకుతారు...త్రిష

July 08, 2015 | 05:53 PM | 5 Views
ప్రింట్ కామెంట్
trisha_about_her_marriage_niharonline

త్రిష వరుణ్ మణియన్‌తో జరిగిన నిశ్చితార్థం కొన్నాళ్ళకే కాన్సిల్ చేసుకోవడం.. ఆ తరువాత ఇరువురూ నోరు విప్పకపోవడం తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ  పెళ్లి గురించిన ప్రస్తావన తీసుకువచ్చింది త్రిష. వరుణ్ తో పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, అయితే వాళ్ళు చాలా కండిషన్స్ పెట్టారని అంటోంది. అది నచ్చకనే విడిపోయారట.  అంతటితో ఆగక పెళ్లికొడుకులకేం తక్కవ లేదు. నాకు తగ్గ అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. వారిలో ఎవరో ఒకరిని ఎంచుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని త్రిష స్పష్టం చేసింది. అందుకు ఎంతో కాలం పట్టదు, త్వరలోనే తగిన వరుడితో మూడుముళ్లూ వేయించుకుంటానని త్రిష అంటోంది. అయితే దీన్నిబట్టి ఆమె మనసులో ఎవరో ఉన్నారని అనుకుంటున్నారంతా. అందుకే త్రిష ఇంత ధీమాగా ఉందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏమిటో చెప్పడం లేదు. ఇరు కుటుంబాల మధ్య కొందరున్నారనీ, వారి వల్ల కూడా నిశ్చితార్థం రద్దు చేసుకోడానికి కొంత కారణమైనట్టు చెపుతోందట. కానీ వాళ్ళ పేర్లు కూడా వెల్లడి చేయడం లేదు త్రిష.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ