గోమాంసం కోసం వెటరన్ హీరో తహతహ

March 20, 2015 | 05:26 PM | 53 Views
ప్రింట్ కామెంట్
rishi_kapoor_niharonline

గోమాంసం విక్రయించినా, తిన్నా వారికి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా అనే చట్టం తీసుకు వచ్చారు మహారాష్ట్రలో. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్ర పతి ఆమోద ముద్ర వేశారు. హర్యానాలో కూడా ఈ చట్టం అమలో ఉంది. శిక్షల్లో మాత్రం తేడా ఉంది. అయితే ఈ నిషేధానికి వ్యతిరేకత ఎదురవుతోంది. మహారాష్ట్ర ప్రముఖులు  ఈ చట్టంపై చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై బాలీవుడ్ నటుడు రిషికపూర్ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. రిషి సోషల్ మీడియాలో తన భావాన్ని వ్యక్తీకరించారు. తాను హిందువునే... అయినప్పటికీ తాను ఆవుమాంసం తింటానని, తనకూ భక్తి ఉందనీ, హిందుత్వాన్ని విశ్వసిస్తానని చెప్పుకొచ్చాడు. చట్టం నిషేధంపై వ్యతిరేకిస్తూ...

     ఇటీవల కాలంలో చీటికీ మాటికి విదేశాలకు వెళ్ళొచ్చే వారికి అక్కడ ఎక్కువగా దొరికే ఈ మాంసాన్ని భుజించడం అలవాటు చేసుకున్నారు. అంత మాత్రం చేత తినకపోతే ఉండలేని పరిస్థితి కాదుగా... తినాలంటే ఎన్ని రకాల మాంసాలు లేవు? ఆవుమాంసం తినొద్దని చట్టం చేసినంత మాత్రాన మనం ఆకలితో నకనకలాడిపోం కదా....? మన హిందూ ధర్మాన్ని కనీసం మన దేశంలోనైనా పాటిస్తే బాగుంటుందేమో? ఒక పక్క బాడీలు పెరక్కుండా జిమ్ములూ, జిమ్మిక్కులూ... ఫాస్టింగులూ... సర్జరీలు....  అంటూ... గో మాంసంపై తహ తహ ఏంటండీ...?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ