ఒక పోర్న్ స్టార్ గా కెరీర్ ను ప్రారంభించి బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సన్నీలియోన్. కెనడాలో శృంగార తారగా వెలుగొంది ఆపై పలు మలుపులతో ఇండియాకు వచ్చి చేరి ఇప్పుడు ఇక్కడ ఏలుతుంది. అలాంటి ఈమె తన ట్విట్టర్ ఖాతాలో అసభ్య ఫోటోలు పోస్టు చేయవద్దని వేడుకుంటుంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. రసజ్ఞులైన ఆమె అభిమానులు, గతంలో ఆమె నటించిన చిత్రాల్లోని (అర్థమయి ఉంటుంది) ఫోటోలను ఇక్కడ ఇప్పుడు షేర్ చేస్తున్నారంట. దీంతో ఈ భామ చాలా ఫీలవుతుంది. అదంతా గతం. ఇప్పుడది అవసరం లేదు. అలాంటి ఫోటోలు, వ్యాఖ్యలు పోస్టు చేయవద్దు అంటూ ఫ్యాన్స్ ని కొరుతుంది. అంతేకాదు ట్విట్టర్లో బ్లాక్ చేయటమనే ఆప్షన్ ను ఆమె కోసమే పెట్టినట్టున్నారని, బాలీవుడ్ తరపున అత్యధిక మందిని బ్లాక్ చేసిన నటిని తానేనని చెబుతోంది. తన ఫాలోవర్ల లిస్టుతోపాటు బ్లాక్ చేసిన మెంబర్ల లిస్టు కూడా చాలా పెద్దనేనని అంటోంది. గతం గతం అనుకున్నప్పుడు ఇప్పుడు చేసే సినిమాలు ఎలా ఉంటున్నాయో ఓ లుక్కేస్కో. సెక్సీ భామ మాటలు ఎలా ఉన్నాయంటే... దెయ్యాలు వేదాలు వల్లించినట్లు... ఏమంటారు?