కమెడియన్ గా కొన్ని సంవత్సరాలు అందరినీ నవ్వులతో ముంచెత్తిన సునీల్ ఇప్పుడు హీరో అయిపోయాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, తడాకా వంటి హిట్ చిత్రాలను అందించిన సునీల్ ఇప్పుడు మరో కొత్త సినిమాలో హీరోగా నటించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు వంశి కృష్ణ ఆకెళ్ళతో ఇటీవలే సినిప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా పూజాకార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంభందించి రెగ్యులర్ షూటింగ్ ని అగష్టు మెదటి వారం నుండి ప్రారంభిస్తారు. ప్రేమకథా చిత్రమ్ సినిమాని నిర్మించిన ఉత్తమాభిరుచి వున్న నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-2 గా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో హీరో సునిల్ సరసన ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సిస్టర్ మన్నార్ చోప్రా హీరోయిన్ గా నటించనుంది. ఈ సందర్బంగా నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ. మూడు జెనరేషన్స్ తరువాత చిన్న చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ రేంజి కి వెలుతుందని నిరూపించిన చిత్రం ప్రేమకథా చిత్రమ్. ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రాన్ని చూసి ఫోన్ కాల్స్ వస్తుంటాయంటే ప్రేక్షకుల్లో ప్రేమకథా చిత్రమ్ సినిమా, మా బ్యానర్ ఎంతలా పాతుకుపోయిందో చెప్పనక్కర్లేదు. అలాంటి బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-2 గా ఓ చిత్రాన్ని నిర్మిచాలంటే అదే రేంజి కథతో చేయ్యాలి. అందుకే దాదాపు ఎన్నో కథలు విన్నాను. వాటిలో కొన్ని బాగున్నా కూడా ప్రేమకథా చిత్రమ్ రేంజి కథ నే చెయ్యాలనుకుని వెయిట్ చేశాను. ఇంతలో రక్ష చిత్ర దర్శకుడు వంశి కృష్ణ ఆకెళ్ళ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. మా బ్యానర్ లో ఇలాంటి చిత్రమే చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. మా బ్యానర్ లో ద్వారా స్టార్ కమెడియన్ అయిన సప్తగిరి ఎప్పుడు చెయ్యని ఓ వైవిధ్యమైన కామెడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ధియోటర్ కి వచ్చిన ప్రేక్షకున్ని కడుపుబ్బ నవ్విస్తాడు. అగష్టు మెదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి కంటిన్యూగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాము. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నిఅలరిస్తుంది అని అన్నారు. ఈ చిత్రంలో నాగినీడు, తాగుబోతు రమేష్, ప్రదీప్ రావత్, పృద్వి, రాజారవీంద్ర,సుప్రీత్ రెడ్డి, షఫి, అదుర్స్ రఘు, ప్రగతి, శ్రావ్య, పవిత్రా నాయర్ తదితరులు నటిస్తుండగా.. సంగీతం:ధినేష్, ఆర్ట్ : రమణ వంకా, కెమెరా: సాయి శ్రీరామ్, ఎడిటర్ :ఎమ్.ఆర్.వర్మ, కో-డైరక్టర్స్ : రామచంద్రరావు, శివాంజనేయులు, కాస్ట్యూమ్స్: మస్తాన్, పి.ఆర్.వో: ఏలూరు శ్రీను సహ-నిర్మాతలు: మాస్టర్ ఆర్.ఆయుష్ రెడ్డి, ఆర్.పి.అక్షిత్ రెడ్డి, నిర్మాత.:ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ-స్కీన్‌ప్లే -దర్శకత్వం :వంశి కృష్ణ ఆకేళ్ళ