వర్మ-సంపూ... వాట్ ఏ కాంబో!

November 18, 2014 | 03:21 PM | 55 Views
ప్రింట్ కామెంట్

మీరు విన్నది కరెక్టేనండీ బాబు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ఓ సినిమాను తీయబోతున్నాడు మన సెన్సెన్షల్ ( ఇక ఆ బిరుదు పోదు లేండి) డైరక్టర్ రాంగోపాల్ వర్మ. ఈ చిత్రానికి ‘‘పోకిరి రిటర్న్స్’’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని నటుడు మంచు విష్ణు తన సొంత బ్యానర్ 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరపున నిర్మించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి గానూ సంపూ బాబుకు రూ.16 లక్షలు పారితోషకంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. మరి వర్మ ఫ్యాక్టరీలో సంపూ కలిసిపోతాడా? లేక వర్మకే మనోడు తన స్టైల్ ను నేర్పిస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ తోపాటు సరైన ఫేస్ వాల్యూ లేకపోయినా ఫేస్ బుక్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ హృదయకాలేయం హీరో ఇండస్ట్రీకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని ఎప్పుడూ చెబుతుంటాడు. ఆ కష్టాలే ప్రస్తుతం ఈ స్థానంలో నిలబెట్టాయని గుర్తుచేసుకుంటు సంతోషం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం మన బర్నింగ్ స్టార్ కొబ్బరి మట్ట, వైరస్ డాట్ కమ్, సింగం 123 సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. కష్టే ఫలి అన్న దానికి ఎంతైనా మనోడు నిలివెత్తు నిదర్శనం కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ