‘శివ’ సినిమాతో సంచలనం రేపిన ఈ దర్శకుడు ఇప్పటికీ ఏదో ఒక సంచలన వార్తతో సినీ అభిమానులకు దగ్గరగా ఉంటుంటాడు. మంచో చెడో తన గురించి ప్రజలు ఏదో ఒకటి అనుకోవాలనుకుంటాడు. అయితే ట్విట్టర్ లో రెండు ఫొటోలు పెట్టి ‘ఇప్పుడే నేను అరెస్టయ్యాను’. అని పోస్టు చేశారు. ఇలా ఫొటోలు చూస్తే ఏమనుకుంటారెవరయినా, అరెస్టయ్యారనే కదా? కొందరు ఫొటోలు మాత్రం చూసి మ్యాటర్ చదవడానికి బద్దకిస్తే... ఇంతే సంగతులు ఆయన అరెస్టు వార్త పాకిపోతుంది అలా అలా... ఫొటో చూసి షాక్ అయిన వాళ్ళూ ఉన్నారు. అలా అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా మరి. ఆయనపై ఎప్పుడూ ఏదో ఒక పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇస్తూనే ఉంటారు. అందరూ అనుకున్నట్టు ఇది నిజం కాదు...ఆయన సరదాగా పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో కూర్చుని ఓ ఫొటో దిగాడు.... ఆయన తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో బంజారాహిల్స్ పీఎస్కు చెందిన ఓ పెట్రోలింగ్ వాహనం ఈయనకంట్లో పడింది. ఆయన నేరుగా వెళ్ళి అందులో కూర్చున్నాడట. పోలీసులకు ఆయన తెలుసుకాబట్టి ఏమీ అభ్యంతరపెట్టలేదు. ఇంకేముంది. వర్మ ఫ్రెండ్ క్లిక్ క్లిక్ మని రెండు ఫొటోలు తీసేశాడు. ఇవి ట్విటర్ ఎక్కౌంట్ లోకి చేరిపోయాయి. అదన్న మాట సంగతి. ఆయనను ఏ పోలీసులూ అరెస్టు చేయలేదు.