రాందేవ్ ను కూడా చూశాకే మాట్లాడమంటున్నాడు

January 01, 2015 | 03:03 PM | 31 Views
ప్రింట్ కామెంట్

అమీర్ ఖాన్ పీకే చిత్రంపై చెలరెగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. తమ మతాన్ని కించపరిచి మనోభావాలు దెబ్బతీశాయని ఓ వర్గంవారు చేస్తున్న రచ్చ తెలిసిందే. యోగా గురువు బాబా రాందేవ్ కూడా ఈ చిత్రంపై విరుచుకుపడిన విషయం కూడా విదితమే. అయితే ఆయన సన్నిహితుడు వేద్ ప్రతాప్ వైదిక్ మాత్రం చిత్రం గురించి పాజిటివ్ గా మాట్లాడారు. అపార్థం చేసుకోవటం వల్లే పీకే చిత్రాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారని పాత్రికేయుడైన వైదిక్ తెలిపారు. మీరు వ్యతిరేకించేముందు ఒక్కసారి సినిమాను చూడాలని, నిజానికి ఈ చిత్రం మతపరమైన మోసాలకు వ్యతిరేకమని చెప్పారు. ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేస్తుడటంతో తానూ ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అంతేకాదు పీకే పై రాందేవ్ కూడా చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై వైదిక్ స్పందించాడు. తన ప్రకటనలో రాందేవ్ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో తెలీదు కానీ, బహుశా ఆయన ఈ చిత్రాన్ని చూశాక తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు అని తెలిపారు. గతేడాది పాకిస్థాన్ లో తీవ్రవాద నేత హఫీజ్ సయీద్ ను కలవడం ద్వారా తీవ్ర విమర్శలకు గురై వైదిక్ పాపులర్ అయ్యాడు. వివాదాల మాటేమో గానీ తొలి నాలుగు, ఐదు రోజులు వీక్ గా ఉన్న కలెక్షన్లు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుని ధూమ్ -3 రికార్డును బద్ధలు కోట్టేలా ఉన్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ