కాజల్ కు సినిమాలు తగ్గినట్టే లెక్క. ప్రస్తుం రిలీజ్ కాబోయే టెంపర్ లోనూ, తమిళంలో మరో రెండు సినిమాల్లో బుక్ అయ్యింది. ఆమె ఇష్టం వచ్చినట్టు రెమ్యునరేషన్ పెంచేయడం వల్లనో మరే కారణం చేతనో ఆఫర్లు మాత్రం తగ్గాయి. ఇటీవల ఓ తమిళ చిత్రం కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఓ కండోమ్ కంపెనీ తమకో చిన్న యాడ్ చేసిపెట్టమని కాజల్‌ను సంప్రదించిందట. ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్ళిన వారికి కాజల్ గట్టి షాక్ ఇచ్చిందట. సాధారణంగా కండోమ్ యాడ్స్ అంటే హీరోయిన్లు పెద్ద ఆసక్తి చూపరు. కానీ కాజల్ 30 సెకన్ల ఆ యాడ్‌లో నటించేందుకు రూ 2.5 కోట్లు డిమాండ్ చేసిందట. కాజల్ డిమాండ్ కు కళ్లు తిరిగిన ఆ సంస్థ వెనక్కి వెళ్ళిపోయారు. ఇంతకూ ఆమె డిమాండ్ కు తగినట్టు వారు ఇవ్వడానికి రెడీ అయితే కాజల్ కండోమ్ యాడ్ లో నటిస్తున్నట్టే కదా!