ఒకేసారిగా రెండు బ్లాక్ బస్టర్ మూవీలకు కథను అందించిన కథకునిగా భారత్ లోనే కాదు ఆయన పేరు దేశ దేశాల్లోనూ మారుమ్రోగిపోతోంది. పుత్రుడు రాజమౌళి దర్శకుడిగా, కథకుడిగా విజయేంద్రప్రసాద్ లు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యారు.
కేవలం మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల కలెక్షన్ సాధించిన హిందీ సినిమా అన్న రికార్డును క్రియేట్ చేసిన రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ పేరు బాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది. సల్మాన్ నటించిన భాయే జాన్ చిత్రం ఎంతో మందిని కంట తడి పెట్టించింది. భావోద్వేగంతో ఊగిపోయేలా చేసిన విజయేంద్ర ప్రసాద్ కు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందట. ఒక మూగ చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక భారత యువకుడు పాకిస్థాన్ కు అనుమతి లేకుండా ప్రవేశించి.. విజయవంతంగా తిరిగి రావటాన్ని కథాంశంగా తీసుకొని మలచిన చిత్రం.. రెండు దేశాల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఆసక్తికరంగా ఇలాంటి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఇప్పటివరకు పాకిస్థాన్ కు వెళ్లలేదట. తనను ఎవరైనా పిలిస్తే, పాకిస్థాన్ కు వెళ్లాలని ఉన్నట్లుగా చెప్పాడాయన. మరి ఈయన కోరిక తీర్చేందుకు పాకిస్తానీయులు ఎవరైనా ఈయనను ఆహ్వానిస్తే బాగుండు.