సూర్య-విక్రమ్ కథను కన్ఫర్మ్ చేసుకోండి

March 09, 2016 | 11:32 AM | 4 Views
ప్రింట్ కామెంట్
suriya-24-movie-story-niharonline

సౌత్ డైరక్టర్ విక్రమ్ కుమార్ సినిమాలు విచిత్రంగా ఉంటాయి. ఒకదానికోకటి అస్సలు సంబంధం ఉండవు. 13బి లాంటి హర్రర్ థ్రిల్లర్ తీశాక ఇష్క్ లాంటి ప్రేమకథ తీస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే మనం లాంటి ఫ్యామిలీ చిత్రం తీసి అక్కినేని కుటుంబంతోపాటు తెలుగు సినీపరిశ్రమకు ఓ మరిచిపోలేని సినిమా అందించాడు. ఇక ఇప్పుడు సూర్యతో 24 అనే ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో రాబోతున్నాడు.   

                           ఇటీవలె రిలీజైన ట్రైలర్ ను బట్టి చిత్రం టైమ్ ట్రావెల్ కి సంబంధించి ఉండొచ్చన్న అనుమానాలు కలిగాయి. ఎక్స్ మెన్, ట్రావెల్ మిషన్ లాంటి ఆంగ్ల చిత్రాలతోపాటు, క్రిష్-3 లాంటి బాలీవుడ్ చిత్ర లక్షణాలు కనిపించాయి. అయితే కథపై దర్శకుడు విక్రమ్ కుమార్ స్పందించాడు. కాలంలో ప్రయాణించడం ఆధారంగానే చిత్రం ఉండబోతుందని స్పష్టం చేశాడు. చిత్రం మొత్తం గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించి ఉంటుందని చెప్పేశాడు. గతానికి సంబంధించిన సన్నివేశాలను ముంబైలో, ప్రస్తుత కాలానికి సంబంధించిన సన్నివేశాలను చెన్నైలో, భవిష్యత్తుకి సంబంధించిన సన్నివేశాలను పోలెండ్ లో  ప్రత్యేక సెట్లు వేసి చిత్రీకరించినట్లు చెప్పేశాడు.

ఇందులో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్లో, ఐదు షేడ్స్ లో కనిపిస్తాడంట. ముఖ్యంగా ఆత్రేయ పాత్ర బాగా పేలుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు విక్రమ్. సూర్యకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది కాబట్టి  రెండు భాషల్లోను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారుట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ