అనసూయ కసి తీరిందా?

March 08, 2016 | 03:42 PM | 4 Views
ప్రింట్ కామెంట్
anasuya-tweets-not-on-mega-family-niharonline

కేవలం అందం, టాలెంటు మాత్రమే కాదు, వివాదాలతో బాగా పాపులర్ అయ్యింది హాట్ యాంకర్ అనసూయ. ముఖ్యంగా పవన్ సినిమాలో రెండు సార్లు అవకాశం వచ్చినప్పటికీ అక్కర్లేదు అంటూ నిర్మోహమాటంగా తిరస్కరించి మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. విచక్షణ కోల్పోయిన కొంతమంది అయితే ఏకంగా అనసూయ ఫ్యామిలీని కూడా లాగి బండబూతులు తిట్టేశారు. ఆ టైంలో తీవ్రంగా హర్టయిన అనసూయ అలాంటి ఐటెం రోల్స్ కి అస్సలు ఒప్పుకోనని తేల్చి చెప్పేసింది.

                        అది చూసి ఆమె తీరును కొందరు పొగరన్నారు, మరికొందరు తెగువ అన్నారు. చివరికి ఎలాగోలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. సోగ్గాడే చిన్నినాయనలో గెస్ట్ రోల్ లో అలరించిన అనసూయ క్షణం లో మాత్రం ఫుల్ లెంగ్తీ రోల్ లో నటించింది. సినిమాలో హీరోయిన్ కంటే ఆమె పాత్రే హైలెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఈజ్ బెస్ట్ రివేంజ్ అంటూ అనసూయ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ట్వీట్ గతంలో తనను అవమానించిన మెగా అభిమానుల కోసమేనంటూ ఆకతాయిలు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియదు కానీ ఎవరికి నచ్చినట్లు వారు దీన్ని అన్వయించుకున్నారు. ఇక తన ట్వీట్ వివాదాస్పదం అయిపోతోందని భావించిన అనసూయ వెంటనే ట్యామేజ్ కంట్రోల్ ట్వీట్స్ చేసింది. నన్ను మళ్లీ ఆ రకంగా వాడుకోకండయ్యా అంటూ ట్వీట్ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ