ఎన్టీఆర్ కు టెంపర్ తరువాత చాలా గ్యాస్ వచ్చిందనీ, ఇంతవరకూ సినిమా మొదలు పెట్టలేదనీ.... కారణం ఏమై ఉంటుందోనని రకరకాల కారణాలను ఎవరికి వారు ఊహించేసుకున్నారు. కానీ అసలు కారణం మాత్రం ఈ షూటింగ్ కోసం లండన్ వెళ్ళాల్సి ఉందట. ఈ లోగా ఎన్టీఆర్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సుకుమార్ సినిమా కేన్సిల్ అవుతుందేమో అనుకున్నారు. ఈ సినిమా ఆలస్యానికి గల కారణాన్ని నిర్మాత బివిఎస్ఎస్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. యూనిట్ లోని కొందరికి వీసా సమస్య తలెత్తిందట... జులై ఒకటి నుంచి బ్రిటన్ లో షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చెప్పేశారు.
ఇక ఈ సినిమాకు సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు తండ్రిగా నటిస్తున్నారు. ఈ సీనిమాకు 'మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు కూడా. ముందుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తారని అనుకున్నారు. అయితే చివరకు ఆ పాత్ర చేసే అవకాశం రాజేంద్ర ప్రసాద్ కి దక్కింది. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధంపై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్‑సింగ్ కు తండ్రిగా జగపతిబాబు నెగటివ్ రోల్‑ చేయనున్నారు.