బెజవాడ రౌడీలకు వర్మ సాలిడ్ వార్నింగ్

February 23, 2016 | 11:37 AM | 4 Views
ప్రింట్ కామెంట్
RGV-challenge-and-warns-vijayawada-rowdies-niharonline

సంచలనాలకు మారు పేరు. ఓపెన్ గా మాట్లాడి విమర్శలు వచ్చినా పట్టించుకోడు. నా తీరే ఇంతా అంటాడు. అలాంటి వర్మకు వార్నింగ్ ఇస్తే ఊరుకుంటాడా? తన అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ 'వంగవీటి' కోసం కులాల పేరుతో  పాట రాసిన సిరాశ్రీకి బెదిరింపులు వచ్చాయంట. దీంతో వాళ్లకు ఇదే తన చివరి హెచ్చరికంటూ రాంగోపాల్ వర్మ పెట్టిన ట్వీట్లు సంచలనం కలిగిస్తున్నాయి.

"విజయవాడ రావడానికి వార్నింగ్ ఇస్తున్న వాళ్లకి నా కౌంటర్ వార్నింగ్. నేనిప్పుడొస్తా. ఎక్కడుంటానో చెబుతా. మీకు దమ్ముంటే ముంబైలో అడుగు పెట్టండి" అంటూ గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్వీట్లు మొదలు పెట్టిన వర్మ పలు హెచ్చరికలు చేశాడు.

"నాకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలనుకునే ఆకురౌడీలు బావిలో కప్పులు. విజయవాడను నేను ఆ రౌడీలమనుకునే రౌడీలకన్నా ఎక్కువ గౌరవిస్తా" అని, 26న ఉదయం ఎయిర్ కోస్టా విమానంలో 11:25కు విజయవాడలో దిగుతానని చెబుతూ, పీఎన్ఆర్ నంబర్ ను ట్వీట్ చేశాడు. ఆపై, "రౌడీగార్లో... నేను బందర్ రోడ్డులోని ఫోర్చ్యూన్ హోటల్ లో దిగుతున్నా... పాత ఖాందారీ హోటల్" అని, "ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఈనాటి ఆకు రౌడీలకి నేనిచ్చే వార్నింగ్..." అంటూ రాత్రి 11:30 వరకూ వరుస ట్వీట్లు పెట్టాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ