ప్రముఖ అమెరికన్ టీవీ నటి కిమ్ కర్దాషియన్ ఫోటోలకు ఫోజిచ్చేప్పుడు ఎప్పూడూ నవ్వదట. ఎందుకని అంటే, నవ్వినప్పుడు ముఖంపై ముడతలు ఏర్పడతాయని, అందుకే నవ్వనని చెబుతోంది. అయితే గతంలో తాను నవ్వినప్పుడు తీసిన ఫోటోను ఒకటి కిమ్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. చూడండి నేను నవ్వగలను. కాకపోతే సందర్భానుసారం బట్టి నవ్వుతాను. కానీ, ఎప్పుడూ కాదు. ఎందుకంటే దానివల్ల ముఖంపై ముడతలు ఏర్పడుతాయి అంటోది ఈ హాలీవుడ్ బ్యూటీ.