ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సీని నటుడు రాంచరణ్ పై షాకింగ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. యండమూరి నవలల ఆధారంగానే చిరంజీవి బ్లాక్ బస్టర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అభిలాష, మరణ మృదంగం, ఛాలెంజ్ ఇలా అన్నీ యండమూరి రచనల ఆధారంగానే తెరకెక్కాయి. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది. అలాంటి వ్యక్తి చిరు తనయుడిపై అసలు కామెంట్లు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?
మాములుగా స్పీచ్ లతో దంచే యండమూరి తాజాగా ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సెమినార్ కి హాజరయ్యారు. అక్కడ వ్యక్తులు పైకి ఎలా వస్తారో సోదాహరణ చెప్పటానికి ఆయన ప్రయత్నించారు. చిరంజీవి భార్య సురేఖ రాంచరణ్ ని స్టార్ ని చేయడానికి ఎంతో కష్టపడింది. ప్లాస్టిక్ సర్జరీల దగ్గరి నుంచి, పెళ్లి చేసేదాకా ఆమె కష్టపడి తన కొడుకుకి స్టార్ డమ్ సంపాదించి పెట్టింది.
ఇక్కడ మరో వ్యక్తి గురించి చెప్పుకుందాం. 8 ఏళ్ల వయసులోనే ఇళయరాజా చేత గొప్ప వ్యక్తి కీర్తించబడ్డాడు ఆ బాలుడు. నేను ముద్దుగా సరస్వతి ప్రసాద్ అని పిలుస్తాను. అతను ఎవరో కాదు రాకింగ్ మ్యూజిక్ డైరక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్. అతను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడ స్టార్ గా ఎదిగిపోయాడు అంటూ చెప్పుకోచ్చాడు.
దేవీ స్వశక్తితో ఎదిగాడని తన తండ్రి పేరు వాడుకోలేదని చివరగా కంక్లూజన్ ఇచ్చాడు యండమూరి. వ్యక్తి ఎదుగల గురించి చెబితే చెప్పాడు కానీ, మరి స్నేహితుడి కొడుకుపైనే ముఖ కవళికలను, పర్సనల్ లైఫ్ ని వర్ణిస్తూ ఇలా సెటైర్లు వేయటం అక్కడ అస్సలు అవసరం లేదనేది మాత్రం నిజం.