బాహుబలి గ్యాప్ లో మరో వైవిధ్యభరితమైన చిత్రంలో నటించేందుకు ఆజానుబాహుడు రానా సిద్ధమైపోయాడు. దర్శకుడు సంకల్ప్ రెడ్డి 'ఘాజి' అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సముద్రం .. సబ్ మెరైన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కీలకమైన కమాండర్ పాత్ర కోసం ముందుగా ప్రకాశ్ రాజ్ ను సంప్రదించారు. ఆ సమయంలో ప్రకాశ్ రాజ్ సొంత సినిమా 'మనవూరి రామాయణం' సినిమాను ప్లాన్ చేస్తుండటంతో, ఆ పాత్రను అంగీకరించలేకపోయాడు. దీంతో వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించే మరో నటుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు కెకె మీనన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ పాత్రను పోషించడానికి ఆనందంగా అంగీకరించాడని అంటున్నారు. పలు హిందీ సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మీనన్. సిద్ధార్థ్ నటించిన ఎన్ హెచ్ 4 చిత్రం ద్వారా సౌత్ ప్రేక్షకులకు ఆయన పరిచయస్థుడే. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సబ్ మెరైన్ సెట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.