కన్నడ కంఠీరవ మనుమరాలి వివాహం

September 01, 2015 | 12:51 PM | 5 Views
ప్రింట్ కామెంట్
shivaraj_kumars_daughter_wedding_niharonline

కన్నడ కంఠీరవ డా|| రాజ్‌కుమార్‌ మనుమరాలు, నటుడు శివరాజ్‌కుమార్‌ కుమార్తె డాక్టర్‌ నిరుపమ వివాహం నిన్న (31 ఆగస్టు) బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో అట్ట హాసంగా జరిగింది. ఈ వివాహానికి దక్షిణ భారత సినీ పరిశ్రమ ప్రముఖులెందరో హాజరయ్యారు. రాజకీయ నేతలు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు హాజరయ్యారు. హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పెద్ద కొడుకు) కుమార్తె డాక్టర్‌ నిరుపమ- డాక్టర్‌ దిలీప్‌ తో జరిగింది. ఈ వివాహాన్ని దాదాపు ఐదు వేలమంది వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది అభిమానులు కూడా హాజరయ్యారు. రాజ్‌కుమార్‌ సొంతగ్రామం గాజనూరు నుంచి రెండు బస్సుల్లో గ్రామస్తులు ఆదివారమే వేదిక వద్దకు చేరుకున్నారు. విఖ్యాత ఆధ్యాత్మికవేత్త- ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ, తెలుగు చిత్ర ప్రముఖులు హరికృష్ణ, నాగార్జున, శ్రీకాంత్‌, తమిళనటుడు ప్రభు, కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్‌, కర్ణాటక మంత్రులు ఆర్‌.వి.దేశ్‌పాండే, డి.కె.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. అతిథులను శివరాజ్‌కుమార్‌ స్వయంగా ఆహ్వానించారు. భోజనాల వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా ప్రముఖులకు, అభిమానులకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. పదుల రకాల భక్ష్యాల్ని వండివార్చారు. వేడుక అనంతరం సంప్రదాయం ప్రకారం నిరుపమను వరుడి నివాసానికి పంపారు. సాయంత్రం రిసెప్షన్‌ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ