పెళ్లండీ బాబూ... "దమ్ మారో దమ్" పాటతో టోటల్ భారతీయ చలనచిత్ర పరిశ్రమను షేక్ చేసిన అలనాటి నటి జీనత్ అమన్ గుర్తుందా?. ఆమెకు ఇప్పుడు ఈ లేటు వయస్సులో మళ్లీ పెళ్లి చేసుకొవాలని ఉందట. 1970 నుంచి దాదాపు పదిహేనేళ్ల పాటు దాదాపు ఆమె లేని చిత్రాలు లేవంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో జీనత్ దాదాపు రోజుకు 24 గంటలూ షూటింగ్ లతోనే గడిపేవారట. జనాలు కూడా సినిమాతో పనిలేకుండా కేవలం జీనత్ కొసమే థియేటర్లకు క్యూ కట్టేవారట. కానీ, 1985లో మఝర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చిత్రాలకు గుడ్ బై చెప్పింది. అయితే ఏమనిప్పించిందో ఏమో ఇప్పుడు ఈ 63 ఏళ్ల వయస్సులో తనకు ఎవరినైనా మళ్లీ పెళ్లి చేసుకొవాలని ఉందని చెబుతోంది. ఇన్నాళ్లూ తానొక్కదాన్నే కొడుకుల సంరక్షణ చూసుకున్నానని, వాళ్ల బాగోగులు, సంతోషాలను చూస్తూనే ఇన్నాళ్లూ గడిపేశానని అన్నారు. ఇప్పుడు వాళ్లు ఎదిగిపోయి, సొంత జీవితాల్లో స్థిరపడ్డారు కాబట్టి ఇప్పుడు నేను కూడా సొంత జీవితం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని జీనత్ అమన్ మనస్సులో కొరికను బయటపెట్టింది. ప్చ్ ... టూ లేట్.