ఇంతకు ముందే చాలా సార్లు సినిమాల ద్వారా సమాజానికి ఏం చేస్తున్నారంటూ కొందరు మేధావులు అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు, నటీనటులు జనాలు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం... మాకు డబ్బు కావాలి... మేం వ్యాపారస్తులం... అంటూ సమాధానం ఇచ్చారు. బాగాలేనప్పుడు ఇంత సక్సెస్ ఎందుకు చేశారు... ఇష్టం లేకపోతే చూడకండి... అని కూడా అన్నారు. మరి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ అమ్మాయి వీడియోను చూసిన నటులు డైరెక్టర్లు ఎలా స్పందిస్తారో?
ఈ అమ్మాయి... తెలుగు సినిమాల్లో హీరోయిన్లు కొన్ని సీన్లలో నీచంగా చూపిస్తున్నారు, హీరోయిన్ల బట్టలు బలవంతంగా విప్పే సన్నివేశాలను హీరోయిజంలా చూపిస్తున్నారు. పెద్ద వాళ్లను కొట్టే సన్నివేశాలతో కామెడీ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలతో మన తెలుగు సినిమా దర్శకులు సమాజానికి, యువతరానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తోంది... సోషల్ మీడియా వేదికగా తెలుగు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ఇతర దర్శకులపైనా....అలాంటి సీన్లలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారిపైనా విమర్శనాస్త్రాలు గుప్పిస్తోంది. ఇక హాస్యనటుడు అలీ నయితే బుద్ధిలేదంటూ ఘాటుగా తిట్టేసింది.... సినిమాల్లో హీరోయిన్లకు జరిగినట్లు నిజ జీవితంలో మీ తల్లికో, చెల్లికో జరిగితే మీరు ఎలా సహిస్తారు. ఇంట్లో పిల్లలు తమ కంటే వయసులో పెద్దవాళ్లను కొడితే సహిస్తారా? ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చూపించడం వల్ల అది క్రమ క్రమంగా మన జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తుందంటోంది. కేవలం సినిమా వాళ్ళనే కాదు ఇలాంటి సీన్లను తప్పుపట్టకుండా వీక్షిస్తున్న సమాన్య ప్రేక్షకులనూ విమర్శిస్తోంది. ఆ వీడియోను చూసిన పలువురు ఆసక్తికరంగా స్పందించారు. అందులో నుండి ఓ కామెంట్ సినీ క్రిమినల్స్ నుండి మా బిడ్డలను రక్షించండి.... మా కష్టార్జితాన్నీ తీసుకొని... స్కూళ్లకు కాలేజీలకు వెల్లారనుకుంటున్న మా బిడ్డలు... సినిమా హాల్స్ నుండి బయటకు వస్తుంటే కళ్ళవెంట నీరు తిరుగుతున్నాయి.... కోపంతో పాటు భయంవేస్తుంది.... వాళ్ళ మొఖాలను, కళ్లను చూస్తుంటే... కాళ్ళు, చేతులు ఊగడం... చూస్తుంటే... నోటిలొనుంచి వస్తున్న చెత్త డైలాగులు వింటుంటె భయం వేస్తుంది. ఎవరిని హత్య చేస్తారోనని... ఎవరిమీద యాసిడ్ పోస్తారోనని... ఆత్మహత్యలు చేసుకుంటారేమోనని.... ఏ పోలిసు స్టేషనులో... ఉంటారేమోనని భయం వేస్తుంది. మా బిడ్డలను హంతకులుగా.... పనికిరానివాళ్ళుగా మారుస్తున్న ఈ బాధ్యతలేని... డబ్బుకోసం గడ్డితినే రచయతల, దర్శకుల, కెమెరామెన్ల... మ్యూజిక్ దర్శకుల నుంచి... చెత్త నటీనటులనుంచి సెన్సార్ బోర్డు, ఉధ్యమ సంస్థలు కోర్టులు, పోలిసులు మా బిడ్డలను రక్షించండి....
a-girl-fires-on-telugu-movie-culture-047026.html