ఇంకో వారసుడొచ్చేస్తున్నాడండోయ్...

July 27, 2015 | 01:27 PM | 4 Views
ప్రింట్ కామెంట్
srikanth_son_roshan_niharonline.jpg

హీరోలా వారసులు ఇక లైన్ కట్టేశారండీ... ఇప్పుడొచ్చేవారంతా మూడో తరం వారసులన్నట్టు... కాకపోతే ఈ కొత్త హీరో తండ్రి మాత్రమే నటుడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన నటుడు శ్రీకాంత్. అన్ని రకాల పాత్రలతో మెప్పించిన నటుడు. అందరితో కలిసిపోతూ, వివాదాలకు దూరంగా ఉండే హీరోగా ఈయనకు మంచి పేరుంది. ప్రస్తుతం ఈ హీరోకి ఛాన్స్ లు తగ్గిన మాట వాస్తవం. కానీ ఈయన వారసుడు చేతికెదిగొచ్చాడు. హీరోకు కావల్సిన క్వాలిటీలు పుష్కలంగా ఉన్నాయి శ్రీకాంత్ కొడుకు రోషన్ లో. తల్లి ఊహ పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఈ కుర్రాడిలో.  రోషన్ ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'రుద్రమదేవి 3డి'లో చిన్నప్పటి రానా (చాళుక్య వీరభద్రుడు) పాత్రలో నటించాడు. తనయురాలు మేధ (11)  చిన్నప్పటి రుద్రమదేవి (అనుష్క) పాత్రలో కనిపిస్తుంది. ఈ ఇద్దరినీ తెరమీద చూసే సమయం ఇంకెన్నాళ్ళో లేదు. వీరిద్దరూ క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమయ్యారు.  రోషన్ ని హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమయ్యారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ చదువులు పూర్తి చేశాకే హీరోగా వస్తాడని అంటున్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పటికే ఓ సినిమాలో యాక్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రోషన్ కి తండ్రిలాగానే సినిమాలతో పాటు క్రికెట్ అన్నా బాగా  ఇష్టం మట.  తను కెరీర్ నటనతోనే ప్రారంభించాలనుకుంటున్నాడట. ఇప్పటికే యంగ్ హీరోలు లైన్ కట్టేశారు ఇప్పటికే ఫీల్డ్ లో దిగిన వారితో పాటు అఖిల్, ఆకాశ్ తరువాత లైన్ లో రోషన్, ఆ తరువాత మోక్షజ్న కూడా ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ