ఒకప్పటి తెలుగు నటి సుమలత భర్త కన్నడ సినీ నటుడు అంబరీష్ ఓ అమ్మాయిని ముద్దాడుతున్న ఫోటో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు కూడా ప్రచారం అందుకున్నాయి. కానీ ఈ వార్తలపై సుమలత తీవ్రంగా స్పందించారు. ఆ ఫోటోలోని అమ్మాయి గురించిన పూర్తి వివరాలు బయట పెట్టారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వైభవి అని, తమ ఫ్యామిలీ ఫ్రెండ్, యాక్టర్ జైజగదీష్-విజయలక్ష్మి దంపతుల కూతురని తెలిపారు. వైభవిని అంబరీష్ సొంత కూతురులా చూసుకుంటారు. కొన్ని నెలల క్రితం తామంతా తమ నివాసంలో కలిసామని, ఆ సమయంలో తీసిన ఫోటోయే అది అని ఆమె తెలిపారు. ఆ ఫోటో తమ ఇంట్లోదే అనడానికి బ్యాగ్రౌండ్ లో తమ ఫోటో కూడా ఉందని ఆమె స్పష్టం చేసారు. రాజకీయ లబ్ది కోసం ఈ ఫోటోతో అనవసర రాద్దాంతం చేయొద్దని సుమలత స్పష్టం చేసారు. ఈ వార్తలతో వైభవి చాలా అప్ సెట్ అయిందని, వ్యక్తిగత వ్యవహారాలను ఇలా రచ్చకీడ్చడం సరికాదని సుమలత అన్నారు. వైభవి చిన్నతనం నుండి తమ చేతుల మీదుగా పెరిగిందని, ఆమె తమ కూతురు లాంటిదని సుమలత నొక్కి చెప్పారు.