ప్రముఖ తెలుగు నటుడు ఆహుతి ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగుండక పోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. డాక్టర్లు ఆయనకు అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. త్వరలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసే ఆహుతి ప్రసాద్ కు రాజశేఖర్, జీవితల సినిమా ఆహుతిలో విలన్ గా మంచి అవకాశం రావడంతో ఆయనకు అప్పటి నుంచి ఆయన పేరుకు ముందు ఆహుతి చేరిపోయింది. క్రిష్ణా జిల్లా ముదినేపల్లి పక్కనున్న కోడూరు గ్రామానికి చెందిన ప్రసాద్ విలన్ గా అనేక సినిమాల్లో నటించినప్పటికీ ఆయనలో హాస్యాన్ని పండించగల చాతుర్యం కూడా ఉంది. తండ్రి పాత్రల్లో చక్కగా ఇమిడిపోతాడు. నవరసాలు పోషించగల ఈ నటుడు చందమామ సినిమాలో నటించినందుకు గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు.