100 డేస్ ఓన్లీ ఇన్ 1 సెంటర్

December 27, 2014 | 03:58 PM | 46 Views
ప్రింట్ కామెంట్

ఈ యేడాది వచ్చిన మహేష్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెలిసిందే. ఇందులో వన్ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ హాలీవుడ్ తరహాలో ఉండటంతో కాస్తా ప్రేక్షకులకు చేరువైంది. కానీ ఆగడు చిత్రం మాత్రం అటు కమర్షియల్ గా ఇటు జనాదరణకు నోచుకోకుండాపోయి నిర్మాతలకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే ఇప్పడు ఆగడు గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి తెలిసింది. అనంతపురంలోని రాయదుర్గంలోని మధు థియేటర్లో ఈ చిత్రం వందో రోజు పూర్తిచేసుకుంది. విడుదలైన రెండు వారాలకే థియేటర్ల నుంచి టపా కట్టేసిన ఈ చిత్రం , ఈ ఒక్క థియేటర్లో మాత్రమే వంద రోజులు ఆడింది. హిట్ సినిమాలే వీలైనంత త్వరగా థియేటర్ల నుంచి పోతుంటే, ఒక ఫ్లాప్ చిత్రం వంద రోజులు ఎలా ఆడిందా అన్నదే ఇక్కడ అనుమానం. నిజంగా రాయదుర్గం ప్రజలకు ఈ సినిమా అంతగా నచ్చిందా?, లేక ఈ సినిమాతో నష్టపోయిన థియేటర్ యాజమాన్యం వేరే సినిమా కొనుక్కోడానికి డబ్బులు లేక ఈ సినిమానే కొనసాగిస్తుందా అని జనాలు జోక్ లు వేసుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ