అతని మాటలు మింగుడు పడవు కానీ, అందులో వాస్తవం ఉండకపోదు మరి. తాజాగా మరో వివాదాస్పదంతో ముందుకు వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల విడుదలైన ‘ఐ' ట్రైలర్ చూసిన తర్వాత తనదైన రీతిలో ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపించాడు. ఈ సంక్రాంతి పండగ శంకర్ రాత్రి అవుతుందంటూ కామెంట్స్ చేసారు. ‘ఐ' ట్రైల్ చూసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే....తమిళనాడులో రజనీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పోడిగా కనిపిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. నేను రజనీకాంత్ అభిమానినే, కానీ ఇపుడు శంకర్ అభిమానిగా మారుతున్నాను అని చెప్పుకున్నాడు. అందుకే రజనీకాంత్ కంటే శంకర్ గొప్పోడు అంటున్నాను. శంకర్ లాంటి వ్యక్తి అమీర్ ఖాన్ లాంటి హీరోతో సినిమా తీస్తే అది ఇండియన్ ‘అవతార్' అవుతుంది. ఇండియాలో హాలీవుడ్ లెవల్లో సినిమా తీసింది శంకర్ ఒక్కడే అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.