దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన సినిమా ‘ఆంధ్రాపోరి’ రేపు (జూన్ 5) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కుర్ర హీరో తిరిగి మూడేళ్ళ వరకూ తెరమీద కనిపించనంటున్నాడు.. ఈ సంధర్భంగా ఆకాష్ పూరీ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను నటించిన సినిమా విడుదలయ్యాక మరే చిత్రానికీ చేయనన్నాడు. ఈ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటాననీ... ఈ గ్యాప్ లో బ్యాంకాక్ లో ఫైట్స్, న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి పూరీ జగన్నాద్ దర్శకత్వంలో మళ్లీ అసలు హీరోగా ఎంట్రీ ఇస్తానన్నాడు. తండ్రి దర్శకత్వంలో కాబట్టి మంచి మాస్ కథతో ముందుకు వస్తాడని ఆశించవచ్చు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ మదిరాజ్ దర్శకత్వం వహించారు. జోశ్యభట్ల సంగీతం అందించిన పాటలు చిత్రంలోని పాటలన్నీ చాలా బాగున్నాయనే టాక్ వచ్చింది. అలాగే ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ కుర్రహీరో తొలిచిత్రం సక్సెస్ అవుతుందో లేదో రేపు తేలనుంది.