మార్గరిటా విత్ ఏ స్ట్రా అనే ఇంటర్నేషనల్ మూవీని ఇండియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోను బాలీవుడ్ మిస్టర్ పర్‑ఫెక్ట్ చూసి కంటి నీరును కంట్రోల్ చేసుకోలేక పోయారట. అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి కోయిచ్లిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రంలో ఏముంటిందిలే అంటూ.. భార్య కిరణ్ రావు బలవంతం మీదే మార్గరిటా చిత్రాన్ని అమీర్ ఖాన్ చూశారట. అయితే ఈ సినిమా చూసే సమయంలో అమీర్ కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోందట. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి. ఈ షోను బిగ్ బీ దంపతులు కూడా తిలకించి ప్రశంసలు కురిపించారట.