అమీర్ జంటకు గంటకు రెండు కోట్లు!

February 27, 2015 | 11:15 AM | 60 Views
ప్రింట్ కామెంట్
aamir_kinran_niharonline

ఇప్పటి వరకూ ప్రకటనలతో ఆకట్టుకున్న బాలీవుడ్ జంటలు షారుక్-గౌరీఖాన్, అభిషేక్-ఐశ్వర్యారాయ్ బచ్చన్, సైఫ్-కరీనాకపూర్ లు. ఇలా జంటలతో జనాల్లో క్రేజ్ పెంచి తమ కంపెనీలకు లాభాలను తెచ్చుకునేందుకు తెలివైన ట్రిక్ ప్లే చేస్తున్నారు ప్రకటన దారులు. ఇప్పుడు ఆ జాబితాలో అమీర్-కిరణ్ ల జంట కూడా చేరిపోయింది. ఓ హౌజ్ హోల్డ్ ప్రకటనలో ఈ ఇరువురూ నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికోసం ఈ జంట ఓ గంట సమయం కేటాయించడానికి రెండు కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా చిన్న చిన్న ప్రకటనలు షూట్ చేయడానికి 2 రోజుల నుంచి 3 రోజులు సమయం తీసుకుంటుందట. అంత మొత్తం చెల్లించే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ దేశ వ్యాప్తంగా ఎంత లాభాలను తెచ్చిపెడుతుందో మరి. బుల్లి తెరపై అమీర్ హోస్ట్ గా చేస్తున్న ‘సత్యమేవ జయతే’ అనే హ్యుమానిటీ బేస్ టాక్ షో తరువాత ఈ ఆఫర్ ను అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ యాడ్ సొసైటీ కి రిలవెంట్ గా ఉండడం ఇక్కడ విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ