భక్తుడిగా, దేవుడిగా, ప్రజానాకుడిగా, మన్మధుడిగా, ప్రియుడిగా... ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు... ఇన్ని వైవిద్యమైన పాత్రల్లో కనిపించి సక్సెస్ అయిన తెలుగు హీరో అంటే నాగార్జున అనే చెప్పవచ్చు. అప్పట్లో అన్నమయ్య సినిమా చేసినప్పుడు, మన్మధుడిలా కనిపించే ఈ హీరోని పిలక బ్రాహ్మనుడిగా చూడగలమా అనుకున్నారు. కానీ చూసేశారు. మనం సినిమాలోనూ పంచకట్టుకుని కొత్త కొత్తగా కనిపించారు. బాయ్ సినిమాతో రొటీన్ మాస్ సినిమాలు చేయవద్దనుకుని, కథలో కొత్తదనం ఉంటేనే ఒప్పకుంటున్నారట. ఇప్పుడు కొత్త దర్శకుడు కళ్యాణకృష్ణతో చేస్తున్న ‘సోగ్గాడె చిన్నినాయనా’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కార్తితో కలిసి చేస్తున్న సినిమాలు రెండూ కూడా కొత్త కథలతోనే చేస్తున్నాడు. ఆ సినిమాలు ఇంకా మొదలు పెట్టకుండానే, మరో ఆఫర్ వచ్చేసింది. నాగార్జునకు. కన్నడలో మోహన్ లాల్, పునీత్ రాజ్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘మైత్రి’ని తెలుగులో నాగ్‌తో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ సినిమాను నిర్మాత రాజ్ కుమార్. అయితే ఇది కమర్షియల్ చిత్రంతో పాటు సందేశాత్మకమైనది. అక్కడ బాగా హిట్ అయిన సినిమా. మోహన్ లాల్ క్యారెక్టర్ ను నాగార్జునకు, మరో యువకుడిని పునీత్ క్యారెక్టర్కు తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాను నాగార్జునకు చూపించిన తరువాత ఆయన నిర్ణయాన్ని బట్టి సినిమా రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం.