మహేష్ బావకి మంచి మార్కులే పడ్డాయి

April 30, 2016 | 06:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
critics-praised-sudheer-babu-in-baghi-niharonline

పన్నెండేళ్ల క్రితం తెలుగులో వచ్చిన వర్షం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. టైగర్ షాప్ర్, శ్రద్ధాకపూర్ జంటగా వచ్చిన ఈ చిత్రం బాగీ గా హిందీలో రీమేక్ అయ్యి ఈ శుక్రవారం రిలీజైంది. అయితే మంచి సినిమాను పాడు చేశారన్న విమర్శలను మూటగట్టుకుంది. తోలి రోజు కలెక్షన్లు వచ్చినప్పటికీ, సినిమాపై టాక్ మాత్రం పూర్తిగా నెగటివ్ గానే ఉంది. ఫస్టాఫ్ మొత్తం వర్షం ను యాజ్ ఇట్ ఈజ్ గా దించేయగా, సెకండాఫ్ ను మొత్తం ఓ థాయ్ యాక్షన్ మూవీతో నింపేయటంతో ఎటూ కానీ కిచిడీలా తయారయ్యిందట. అయితే సినిమా మొత్తం మీద పాజిటివ్ ఏదైనా ఉందంటే విలన్ గా నటించిన సుధీర్ బాబు గురించే.

                            మహేష్ బావగా తెలుగు తెరకు పరిచయమైన సుధీర్ బాబు అరడజన్ తెలుగు సినిమాలు చేసినప్పటికీ నటుడిగా పెద్ద గుర్తింపు ఏం రాలేదు.  ఓ రెండు మూడు చిన్న హిట్లు పడ్డప్పటికీ అవి అతనికేం ఉపయోగపడలేదు. అయితే ఉన్న బాడీని బాగా వాడుకుని బాగీ కోసం బాగా కష్టపడ్డాడు. సినిమా కోసం సుధీర్ బాబు ఎంతో కసరత్తు చేశాడు .. మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఎన్నో దెబ్బలు కూడా తాకించుకున్నాడు. ఆ అంకిత భావం .. పడిన శ్రమ వృథా పోలేదు. విలన్ నటన అదుర్స్ అని బాలీవుడ్ ప్రేక్షకులు కితాబునిస్తున్నారట. విమర్శకులు సైతం సినిమాలో ఏదైనా మెచ్చుకోదగింది అంటే సుధీర్ బాబు నటన, యాక్షన్ పార్ట్ అనే. దీంతో సినిమాకు బాడ్ టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లోను మరిన్ని అవకాశాలు రావటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ