ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు వారి అభిమానాన్ని పొందిన కన్నడ హీరో సుదీప్ భార్యనుంచి విడాకులు తీసుకుంటున్నాడు. ఈ విషయంపై మీడియా వాళ్లు ఎక్కువగా స్పందించవద్దనీ, ఇది తమ వ్యక్తిగత విషయమనీ, తన వృత్తి జీవితానికి మాత్రం ఎటువంటి ఆటంకం కలగదని సుదీప్ ఈ సందర్భంగా విన్నవించుకున్నాడట. సుదీప్, ప్రియది ప్రేమ వివాహమే. ఈ వివాహం 14 ఏళ్ళ తరువాత విడిపోవడానికి దారి తీసిన కారణాలు మాత్రం వ్యక్తిగతమని చెపుతున్నారు. వీరికి ఒక అమ్మాయి. ఈ పాప అంటే సుదీప్ కు ప్రాణం కానీ ఆమె తల్లి దగ్గర ఉండడమే మంచిదని పాపని ఆమెకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. భార్య ప్రియా రాధకృష్ణన్, సుదీప్ ఇద్దరూ కుటుంబ న్యాయాలయాన్ని ఆశ్రయించారు. విడాకులు ఇవ్వాలని కోర్టుకు మనవి చేశారు. సెప్టెంబర్ 11వ తేది శుక్రవారం ప్రియా, సుదీప్ సోదరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి వివాహం 2001వ సంవత్సరంలో జరిగింది. సుదీప్ తన భార్యకు భరణంగా రూ. 19 కోట్లు ఇస్తున్నారని ఓ వార్త. ఇది అధికారికంగా తెలియజేయలేదు. సుదీప్ భార్య కోసం ‘360 స్టేజ్ ఈవెంట్ మేనేజ్ మెంట్' అనే కంపెనీ స్థాపించాడు. ఆయన మహిళలు స్వయంశక్తితో బతకాలని అంటుండేవాడట. తన భార్య విషయంలోనూ అలానే ఆలోచించాడు. ఈయన సౌత్ లో పలు భాషల్లో నటించాడు. ఈయన నటుడే కాడు రైటర్, నిర్మాత కూడా సినీ ఫల్డ్ లోకి మొదట రైటర్ గానే అడుగు పెట్టాడు. ఆ తరువాతే హీరో అయ్యాడు.