నటుడు చంద్రమోహన్ కు గుండెపోటు

February 19, 2015 | 04:18 PM | 22 Views
ప్రింట్ కామెంట్
chandramohan_hearattack_niharonline

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్ చంద్రమోహన్ గుండెపోటుకు లోనయ్యాడు. ఒక వైపు రామానాయుడి అంత్య క్రియలకు సినీ ప్రముఖులందరూ రామానాయుడు స్టూడియో ఆయన పార్థీవ దేహాన్ని దర్శించుకుంటుండగా, మరో వైపు చంద్రమోహన్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేర్ మీదే చికిత్స జరుగుతోంది. దీన్ని బట్టి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇంకా సినీ కుటుంబానికి చేరలేదనే తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఆయనకు ఎలాంటి అనారోగ్యం ఉన్నట్టు కూడా వార్తలు రాలేదు. ఇటీవల ఆయన ఎస్పీ చరణ్ తీసిన ఓ సినిమా ప్రమోషన్ కు కూడా హాజరయ్యారు. 1966లో రంగుల రాట్నం ద్వారా సినిమాకు పరిచయమైన చంద్రమోహన్ అత్యధిక చిత్రాలు నటించిన నటుల లిస్టులో ఒకరుగా నిలిచిపోయారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ