పుట్టినరోజే పెళ్లిపీటలు ఎక్కుతున్నాడే!

March 04, 2015 | 02:24 PM | 78 Views
ప్రింట్ కామెంట్
manchu_manoj_engagement_oranitha_reddy_niharonline

కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ కుమార్ , ప్రణతి రెడ్డి ల నిశ్చితార్థ వేడుక మార్చి4న అంటే ఈ రోజు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు దర్శకరత్న దాసరినారాయణరావు, కె.రాఘవేంద్రరావు, రామోజీరావు, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, వైఎస్సార్సీపీ నేత వై.యస్.జగన్, విజయలక్ష్మి, హీరో రామ్ చరణ్ దంపతులు, సంజన, తాప్సీ, శివబాలాజీ దంపతులు, గిరిబాబు, పినిశెట్టి కుటుంబ సభ్యలు, శాంతా బయోటిక్ అధినేత వరప్రసాద్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి విహహాన్నిమే 20న ఉదయం 9 గంటల 10నిమిషాలకు వధువు స్వగృహంలో కానీ, అతిథి గృహంలో కానీ పెద్దల సమక్షంలో ఘనంగా జరపడానికి పెద్దలు నిశ్చయించారు. కాకతాళీయంగా జరిగినప్పటికీ మంచు మనోజ్ తన పుట్టినరోజే పెళ్లి రోజు కావటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ