మామగారు, సీతారత్నం గారి అబ్బాయి చిత్రాలతో ఓ వెలుగువెలిగి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో వినోద్ కుమార్ అరెస్టయ్యారు. హత్యాయత్నం కేసులో ఆయనను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని తన స్వగ్రామం ఈశ్వర మంగలలో ఉన్న వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి తరలించారు.
వివరాల్లోకి వెళితే... సచ్చిదానంద అనే వ్యక్తి వినోద్ కుమార్ వద్ద తన పర్సనల్ మేనేజర్ పై మేనేజర్ గా పనిచేస్తూ, ఆయన ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడు. తన ఫైనాన్స్ మ్యాటర్స్ లో అవకతవకలు జరుగుతున్నాయన్న అనుమానంతో వినోద్ కుమార్, సచ్చిదానందల మధ్య గొడవలు, వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే సచ్చిదానందపై హత్యాయత్నం జరిగింది. జరిగిన విషయాన్ని సచ్చిదానంద పుత్తూరు సమీపంలోని సంప్య పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన పోలీసులు వినోద్ కుమార్ తన మేనేజర్ పై దాడికి ప్రయత్నించాడన్నది వాస్తవమని తేల్చారు. వినోద్ కుమార్ కన్నడ, తెలుగు, తమిళ భాషలలో నటుడిగా గుర్తింపు పొందారు.