కింగ్ నాగార్జున మనం సినిమా వచ్చి ఏడాదిన్నర గడుస్తుంది. ఈ యేడు దొంగాట, తనయుడి అఖిల్ చిత్రంలో ఒక్క పాటలో అది కూడా ఓ నిమిషం గెస్ట్ అప్పీరియన్స్ తో సరిపెట్టుకున్నాడు. ఇక తన అప్ కమింగ్ చిత్రాలు సోగ్గాడే చిన్నినాయన, మరో చిత్రం ఊపిరి విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ ఇవ్వలేకపోయాడు. అయితే ఊపిరిని ఫిబ్రవరి మొదటి వారంలో వదలేందుకు పీవీపీ సిద్ధపడుతుంటే. సొంత బ్యానర్ లో వచ్చే సొగ్గాడే చిన్నినాయన మాత్రం ముందు డిసెంబర్ లో అనుకున్నారు. అయితే డిసెంబర్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ కి ఉండటంతో నిర్ణయాన్ని అది కూడా పోస్ట్ పోన్ చేసుకున్నట్లు సమాచారం. ఇక సొగ్గాడే చిన్ని నాయనను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణణ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆత్మ అనే కాన్సెప్టు తో ముడిపడిన ఈ కథ పల్లెటూరి నేపథ్యంలో కొనసాగుతుంది.
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని కొన్ని రోజుల క్రితమే అనుకున్నారు. ఇక తాజాగా జనవరి 15న విడుదల చేయాలని తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య డిక్టేటర్ తో, జూనియర్ నాన్నకు ప్రేమతో... రెడీగా ఉన్నారు. ఇక ఇప్పుడు నాగ్ కూడా వీరికి జత అవటంతో పోటీ ఇంట్రస్టింగ్ గా మారబోతుంది.