హీరోగా పరిచయమై తెలుగు, తమిళంలో తన చిత్రాలకు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో నిర్మాతగా మారాడు. మంచి చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తూ రాణిస్తున్న విశాల్ తాజాగా మరో కొత్త అవతారం ఎత్తాడు. అదే బ్రాండ్ అంబాసిడర్. తెలుగులో మహేష్, బాలీవుడ్ లో సల్మాన్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నథమ్సప్ కూల్ డ్రింక్ కి తమిళంలో విశాల్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని విశాల్ తెలియజేశాడు.