దసరాకు విడుదలవుతున్న సుకుమార్ ‘కుమారి’

September 02, 2015 | 05:32 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Kumari_21F_poster_niharonline.jpg

సుకుమార్ నిర్మాతగా మారి ఓ సినిమా తీస్తున్నాడంటే, ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. కమర్షియల్ దర్శకుడుగా మంచి పేరున్న సుకుమార్ నిర్మాతగా ‘కుమారి 21 ఎఫ్’ అనే ఓ ప్రేమకథతో సినిమా తీయడానికి పూనుకున్నాడు. ఈ చిత్రానికి కథ కూడా ఆయన రాసుకున్నాడట.  స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆయనవే. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపును పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత కెరటం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘సుకుమార్ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడమే ఆనందంగా వుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న చిత్రమిది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. రాజ్‌తరుణ్ కెరీర్ ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది. పాట మినహా చిత్రీకరణ పూర్తయింది.బ్యాలెన్స్ పాటను త్వరలోనే చిత్రీకరించి అక్టోబర్‌లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ