సమంత సీక్రెట్ అఫైర్ ఇంకెన్నాళ్లు?

November 17, 2015 | 04:29 PM | 4 Views
ప్రింట్ కామెంట్
actress_samantha_ruth_prabhu_secret_affair_love_niharonline

తొలి సినిమాతోనే ఏ మాయ చేసిందో తెలీదుగానీ చెన్నై సోయగం సమంత అప్పటి నుంచి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. నాలుగేళ్లపాటు టాలీవుడ్ ను షేక్ చేసి ఇప్పుడు తమిళంలో కూడా టాప్ హీరోలతో జత కడుతూ అగ్రహీరోయిన్ గా దూసుకుపోతుంది. మూడు పదుల వయసు పై బడుతుంటే సాధారణంగా చాన్సులు తగ్గిపోతాయ్. కానీ, సమంత విషయంలోనే అది పూర్తిగా రివర్స్ అవుతోంది. ఎక్కువ ఛాన్స్ లతోపాటు భారీ రెమ్యునరేషన్ అందుకునే నటిగా సౌత్ లో రికార్డు సృష్టిస్తోంది. అయితే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత పర్సనల్ లైఫ్ కూడా ఫ్యాన్స్ లో బాగా ఆసక్తి రేకెత్తిస్తుంది. అంతకు ముందు హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం జరిపిన ఈ భామ ఆ తర్వాత కొన్ని కారణాలతో ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. సిద్దూను తాను కేవలం ఫ్రెండ్ గానే చూశానని తర్వాత సామ్ చెప్పుకొచ్చేది. అయితే ఇప్పుడు మళ్లీ గాసిప్స్ ఆమెను వెంటాడుతున్నాయి.

ప్రస్తుతం ఒక తమిళ ప్రొడ్యూసర్ తో చాలా చనువుగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకోవిధంగా చెప్పాలంటే తమిళంలో బడా హీరోలతో ఛాన్సులు రావడానికి ఆ ప్రముఖ నిర్మాతే కారణమని, ఆ ప్రొడ్యూసర్ వలలో సమంత పడిపోయిందని కోలీవుడ్ లో ప్రచారం జోరుగా జరుగుతుంది. కాని ఇప్పటివరకు ఆ ప్రొడ్యూసర్ పేరు మాత్రం బయటికి రాలేదు. అయితే దీనిపై ఆమెను అడిగితే తనదైన శైలిలో సమాధానమిస్తుంది. ఆయనెవరో చెప్పండి ఇప్పటి నుంచి అయినా ట్రై చేసుకుంటా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది.  తాను ప్రస్తుతం ఎవరితోనూ లవ్ లో లేనని, ఒకవేళ అలాంటిది ఉంటే దాచాల్సిన అవసరం కూడా లేదని చెబుతోంది. అయితే ఆమె అఫైర్ ప్రోడ్యూసర్ తో కాదని, ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని ఓ యువకుడితో సమాచారం. చూద్దాం... ఈ సౌత్ బేబీ డాల్ సీక్రెట్ అఫైర్ ఎన్నాళ్లూ సాగిస్తుందో. ప్రస్తుతానికైతే తెలుగులో నితిన్ తో అ..ఆ..., మహేష్ సరసన బ్రహ్మోత్సవంలో జతకడుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ