ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయడానికి బహుశా హీరోలందరూ పోటీలు పడవచ్చునేమో... కారణం ఇంతవరకూ ఫ్లాప్ ఇవ్వని ఏకైక తెలుగు దర్శకుడే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కూడా అయ్యాడు కాబట్టి. దీంతో సామాన్య ప్రజలతో పాటు ఇండస్ట్రీ అంతా ఆయన తరువాత సినిమా గురించీ అందులో హీరో గురించిన ఉత్సుకత చూపించడం పరిపాటే. ప్రస్తుతం బాహుబలి విజయోత్సాహంలోనూ, ఆ తరువాత బాహుబలి 2 తోనూ రాజమౌళి బిజీ అయిపోయినా... తరువాతి ప్రాజెక్టుకు కామిట్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం ఓ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల్ని బట్టి తనను ఓ స్టోరీ సిద్ధం చేయమని చెప్పినట్టు, ఈ కథ సహజత్వానికి దగ్గరగా ఉండే సామాజిక సమస్యపై ఉండాలని కోరినట్టు చెప్పారు. అయితే ఈ సినిమా కూడా అజిత్, అర్జున్ లతో ఏక కాలంలో తమిళ్, తెలుగులో తీయనున్నట్టు కూడా తెలిపారు. బాహుబలి సినిమా తమిళంలో 21 రోజుల్లో 64 కోట్లు రాబట్టింది. మొత్తం మీద 500 కోట్లు దాటిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి బాహుబలి సీక్వెల్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాల కోసం నీహార్ ఆన్ లైన్ సైట్ ను చూస్తూనే ఉండండి.