రవి తేజ కిక్ 2 ఏ రేంజిలో కిక్కుస్తుందో గానీ, రిలీజ్ లో అనేక వాయిదాలూ... రీ షూటింగుల వల్ల బడ్జెట్ మాత్రం దాటేసింది. రవితేజ-రకుల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ గురించి ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పెట్టిన ఖర్చకు దగినట్టు బిజినెస్ జరగడం లేదని టాక్ వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను కల్యాణ్ రామ్ నిర్మించారు. వేసవి సెలవులకు రావాల్సిన ఈ సినిమా మళ్ళీ రీ షూట్ జరుపుకుంటూ వాయిదాలు పడుతూ వస్తోంది. కొన్ని సన్ని వేశాలు సరిగా లేవంటూ రవి తేజానే రీ షూట్ పెట్టుకున్నాడనే టాక్ కూడా వినిపించింది. దీని వల్ల దాదాపు 12 కోట్లు అదనపు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో రవితేజ మార్కెట్‌కి మించి బడ్జెట్ దాటిపోయిందని సమాచారం. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ సినిమా కు వసూళ్ళు ఏ మాత్రం రాబట్టుకుంటుందో చూడాలి.