కరణ్ డైరక్షన్ లో ఐష్ రీ ఎంట్రీ

December 01, 2014 | 05:14 PM | 19 Views
ప్రింట్ కామెంట్

ప్రేమ, బంధాలు, కోరికలు వంటి సున్నితమైన అంశాల చుట్టూ తిరిగే కథాంశంతో చిత్రాల పేరు చెప్పగానే గుర్తోచ్చేది కరణ్ జోహరే. అలాంటి కరణ్ డైరక్షన్ లో ఐష్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. తొలిసారిగా కరణ్ జొహార్ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. ఈ చిత్రం పేరు 'ఏ దిల్ హై ముష్కిల్'. ఇందులో ఆమెతో బాటు రణబీర్ కపూర్, అనుష్కా శర్మ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తారు. దీని గురించి దర్శకుడు కరణ్ మాట్లాడుతూ "గతంలో కుచ్ కుచ్ హోతా హై సినిమా కోసం ఐష్ ని అడిగాను. అప్పుడు తాను 'జీన్స్' సినిమా షూటింగులో బిజీగా వుండడంతో చేయలేకపోయింది. ఆ తర్వాత 'కభి అల్విద నా కెహనా'కి అనుకున్నాను. అప్పుడూ కుదరలేదు. అయితే, వాటికి ఆమె సారీ చెప్పిన తీరు, కారణాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పింది" అని అంటున్నాడట. న్యూయార్క్, లండన్, పారిస్, ఢిల్లీ వంటి లొకేషన్లలో షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం 2016 జూన్ 3న విడుదల చేయాలని తేదీని కూడా నిర్ణయించేశాడట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ