మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ కథానాయిక ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను మిస్ వరల్డ్ 2014 వేదికపై ప్రత్యేక అవార్డుతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సత్కరించింది. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికయిన నాటి నుంచి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకుగాను ఈ అవార్డు అందజేశారు. లండన్ లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో జరిగిన మిస్ వరల్డ్ కార్యక్రమంలో, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య, తల్లి వృందా రాయ్ తో ఐశ్వర్య వేదికపై కనిపించింది. ఈ గౌరవం పొందినందుకు చాలా ఆనందంగా ఉందన్న ఐష్ , మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.