షార్ట్ ఫిల్మ్‌లు తీసేవారి కోసం టెన్ ఎంటర్టైన్మెంట్ యూ ట్యూబ్ అనే చానల్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్. తాను ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ మేకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఇందులోని సాధక బాధకాల గురించి తెలిసిన ఈమెకు ఈ చానల్ స్టార్ట్ చేసే ఆలోచన కలిగింది.. చిన్న చిత్రాలు తీసే చాలామంది యువ నిర్మాతలు తమ చిత్రాలు విడుదలకు నోచుకోక, తగిన గుర్తింపు లేక సతమతమవుతుంటారని, ఈ కారణంగా వారిని ప్రోత్సహించేందుకు తానీ చర్య తీసుకున్నానని ఐశ్వర్య తెలిపింది. దర్శకత్వ బాధ్యతల నుంచి బ్రేక్ తీసుకుని కొన్నేళ్లుగా తాను దీని గురించి ఆలోచిస్తూ వచ్చానని ఆమె వెల్లడించింది. ఫేస్‌బుక్‌లోనూ దీనికి ప్రాచుర్యం కల్పిస్తానని ఆమె చెప్పింది. దక్షిణాడి లఘు చిత్రాల అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన ఈ చానల్ ను త్వరలో ఇతర భాషల్లోనూ విస్తరించనున్నట్టు ఐశ్వర్య తెలిపింది.