జక్కన్న ఒక్క ఛాన్సిస్తే చాలట

December 08, 2014 | 05:16 PM | 82 Views
ప్రింట్ కామెంట్

ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని ఎవరికుండదు. సక్సెస్ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన రాజమౌళితో సినిమా చేయాలని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఆశ పడుతున్నాడు. పాపం యాక్సన్ జాక్సన్తో బొక్క బోర్లా పడ్డ అజయ్ దేవగన్ చూపులు రాజమౌళిపై పడ్డాయి పాపం. జక్కన్నతో గతంలో ఈగ(మక్కీ) కి వాయిస్ ఓవర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.ఆయన రిక్వెస్ట్ పై సినిమాలో ఒక ఫైట్ కూడా చేశానన్నాడు. ఆయన డైరెక్షన్ అద్భుతమని మెచ్చకున్నాడు. అజయ్‌ దేవగన్‌ గతంలో యూ మై ఔర్‌ హమ్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2008లో వచ్చిన ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్‌. అప్పటినుంచి ఇంకోసారి డైరెక్షన్‌ గురించిన ఆలోచనే ఆయనకు రాలేదు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ వీరూ దేవగన్‌ కొడుకైన అజయ్‌ దేవగన్‌కి కంప్లీట్‌ యాక్షన్‌ సినిమాకి డైరెక్షన్‌ చెయ్యాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. కానీ గత అనుభవాలతో ఎవరో యాక్షన్‌ చెబితే నటించడం తప్ప, తనకు తానుగా యాక్షన్‌ అని చెప్పుకోడానికి ఇష్టపడటం లేదాయన. అయితే మనసులో కోరిక ఉంటే, అది తొలిచేస్తుంటుంది కదా. అజయ్‌దేవగన్‌ విషయంలో కూడా అదే జరుగుతోందిట. బాలీవుడ్‌లోనే కాకుండా, ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఓ గొప్ప యాక్షన్‌ ఫిలిం చెయ్యడం కోసం ఖాళీ ఉన్నప్పుడల్లా ఆలోచనలు సాగిస్తున్నాడట అజయ్‌దేవగన్‌. భారీ నిర్మాణ వ్యయంతో ఓ సూపర్‌ యాక్షన్‌ సినిమా చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఆ ఆలోచన వాయిదా పడ్తూ వస్తోందని అంటున్నాడు. ఈ మధ్య నటించిన యాక్షన్ జాక్సన్ కూడా అట్టర్ ఫ్లాప్ . మరి ఇంకెందుకు ఆలస్యం... పెద్ద సినిమా చేయాలనే ఆలోచన ఎలాగూ ఉంది. డైరెక్షన్ చేయాలంటే భయం కూడా ఉంది. కొత్తగా రాజమౌళి డైరెక్షన్ తో సినిమా చేయాలని మరో కోరిక. ఇన్ని కోరికలు మనసులో ఉన్నప్పుడు గట్టిగా రాజమౌళి వెంట పడితే తన భారీ చిత్రం ప్లానింగ్ సక్సెస్ చేసుకోవచ్చునేమో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ